మన్మధుడు సీక్వెల్ లో RX100 హీరోయిన్

అక్కినేని నాగార్జున నటించిన ఆఫీసర్, దేవదాస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఓ మంచి విజయం కోసం ఎదురు చుస్తునారు. అందుకే అయన సీక్వెల్ బాట పట్టారు. కే. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మధుడు’ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
 ఇపుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. చి.ల.సౌ. సినిమాతో తనకొంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 ఈ సినిమా తెరకెక్కబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘పాయల్‌ రాజ్‌పుత్‌’ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.
ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో డీ గ్లామర్స్ గా నటించిన పాయల్ ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాలో రవితేజ కు జోడిగా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న మన్మధుడు 2 సినిమా యూనిట్. హీరోయిన్ విషయంలో అధికారికంగా ప్రకటన రావలసి ఉంది. మార్చ్ చివరి వారంనాటికీ సినిమా మొదటి షేడ్యూల్ ప్రారంభంకానుంది.

Comments