మహర్షి సినిమా నుండి మరో స్టిల్

మహర్షి సినిమా నుండి మరో స్టిల్: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు – పూజా హెగ్డే  హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’.  ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ  సినిమాకి సంబంధించి హీరోయిన్ పూజా హెగ్డే స్టిల్స్ బయటకు రాకపోవడంతో అభిమానులంతా నిరాశ చెందారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి మహేష్, పూజా హెగ్డే రొమాంటిక్ స్టిల్  బయటకు వచ్చింది.
మహేష్ బాబు కౌగిలిలో ఒదిగిపోయిన ఓ కుందనపు బొమలా పూజా హెగ్డే కనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సమయంలో  సినిమా యూనిట్ ప్రమోషన్లు మొదలుపెట్టారు.
మహాశివరాత్రి సందర్బంగా సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ నుండి సమాచారం. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్, పీ.వీ.పీ. నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు….  

Comments