సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ


విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. రష్మికా మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని, సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరోవైపు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు.
‘సింగరేణి నేపథ్యం’లో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘సింగరేణి కార్మికుడి’గా నటిస్తున్నాడు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలో కె.ఎ.వల్లభ నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, ఇసబెల్లా, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.. 

Comments