Mister Majnu Movie Review


నటీనటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, వి జయప్రకాష్ , ఇతర  తదితరులు.
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : ఎస్.ఎస్. తమన్
ఎడిటర్ : నవీన్ నూలి

‘అఖిల్, హలో' సినిమాల తర్వాత 'అక్కినేని అఖిల్' హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ మజ్ను'. సవ్యసాచి ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని 'బివిఎస్ఎన్ ప్రసాద్' నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి సినిమా ఏలా ఉందొ చూద్దాం..

కథ :

విక్కీ (అక్కినేని అఖిల్) ఒక ప్లే బాయ్ ఏ అమ్మాయిని చూసినా తన లుక్స్ మాటలతో  నిమిషాలలో తాన ప్రేమలో పడేస్తాడు. కొద్దీ రోజుల తర్వాత అమ్మాయితో రొమాన్స్ చేసి వదిలించ్చుకుంటాడు. ఇలా ప్రతి అమ్మాయితో ప్రేమా ప్రయాణం చేసి మళ్ళి ఇంకో అమ్మాయి వెంటపడుతుంటాడు విక్కీ. మరో వైపు నిక్కీ (నిధి అగర్వాల్)  తనకు కాబోయే భర్త రాముడు లాగా ఉండాలని అనుకుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య  నిక్కీకి విక్కీ పరిచయం అవుతాడు. మొదట విక్కీని అసహ్యించుకుంటుంది నిక్కీ, ఈ క్రమంలో విక్కీ  వ్యక్తిత్వని అర్ధ్యం చేసుకొని అతడిని ప్రేమిస్తుంది. విక్కీ కూడా నిక్కీని ప్రేమించడానికి ప్రయతినిస్తాడు కానీ, కొన్ని రోజులు తర్వాత నిక్కీ సిన్సియర్ ప్రేమ తీరు విక్కీకి నచ్చదు. ఆ విషయం కారణంగా నిక్కీ విక్కీ ఇద్దరు విడిపోతారు. నిక్కి దూరమైన తర్వాత విక్కీకి ప్రేమ విలువేంటో అర్ధం అవుతుంది. అసలు విక్కీ నిక్కీ ఒక్కటౌతారు..? లేదా..? మళ్ళి విక్కీ నిక్కీకి దగ్గర కావడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? ఇలాంటి విషయాలను తేలుకోవాలనుకుంటే సినిమా చూడాలసిందే...

ప్లస్ పాయింట్:

అక్కినేని అఖిల్ ఈ సినిమాలో ప్లేబాయ్ గా తాన పాత్ర కోసం బాగానే నటించాడు. తదైనా స్టైల్, లుక్స్, మరియు డాన్స్ లతో ఆకట్టుకునాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ తాన నటనతో ఆకట్టుకుంది. హీరో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఇక నాగబాబు, రావు రమేష్,  సితార,లోకేష్ వీరంతా వాళ్ల పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడు వెంకీ అట్లూరి తాన టేకింగ్ తో ఆకటుకునాడు. తమన్ తన సంగీతంతో సినిమాకి బలంగా మారాడు. హైపర్ ఆది, ప్రియదర్శి వాళ్ళు తమ కామెడీ టైమింగ్ తో అకాడకడ అలరించారు.

మైనెస్ పాయింట్స్: 

దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలో కథ బాగున్నా కథనం మిస్ అయ్యేందని చూపొచ్చు. ఈ సినిమాలో  కొన్ని కీలక సన్నివేశాలు సాగ తీసినట్టుగా ఉన్నాయి. హీరో హీరోయిన్ విడిపోవడానికి బలమైన కారణాలుండవు కానీ విడిపోతారు. దీనికి తోడు సినిమాలో మెయిన్  ఎమోషన్ బలంగా లేకపోవడం. దర్శకుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలి ప్రేమ’ ఫార్ములానే ఇక్కడా ఫాలో అయ్యాడు. ఈ సినిమాని చుస్తే నెక్స్ట్ సీన్స్ ఏంటో గెస్ చేయొచ్చు అలా ఉంది సినిమా. అయ్యితే అన్నివర్గాల ప్రేక్షకులని మాత్రం అంతగా ఆకట్టుకోలేదని అనీ చూపొచ్చు...

Comments