దూసుకుపోతున్న ‘ F2’

వెంకటేష్- వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘F2 (ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)’. సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, వినయ విధేయ రామ సినిమాల కన్నా ‘ F2 ‘ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్ తో చాల కలం తర్వాత మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్ తేజ్‌, తమన్నా, మెహరీన్‌లు కూడా వీరి నటనతో సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ పండక్కి కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా కావడం  F2  కి కలిసొచ్చింది. మొదటి షో నుండే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి కలక్షన్స్ పెరుగుతున్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాకి 32 కోట్లకు పైగా షేర్‌ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారం కూడా ఏ సినిమా రిలీజ్ కాకపోవడంతో  F2  సినిమాకి కలిసొస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. అయ్యితే ఫుల్‌ రన్‌లో 50 కోట్లకుపైగా షేర్‌ సాధించటం కాయంగా కనిపిస్తోంది.  అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మించారు…

Comments