షాక్ ఇస్తానంటున్న వర్మ

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాని దర్శకుడు రామ్ గోపా వర్మ తెరకెక్కిస్తున్నాడు. సినిమా మొదలైనప్పటి నుండి ఎన్నో వివాదాలు -విమర్శలు వస్తున్నాయి, ఇప్పటి వరకు విడుదల చేసిన 2 పాటలతో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన వర్మ. ఇపుడు ఎన్టీఆర్ వర్థంతి కావడంతో మరో షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎన్టీఆర్ మరణించిన ఈరోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రాణం  పోసుకుంటుందంటున్నారు వర్మ. అయ్యితే సినిమాకు సంబంధించి ఏదో ఒక టీజర్ లేదా పాట, ఫస్ట్ లూక్ ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ విషయం తెలియాలంటే ఈరోజు సాయంత్రం 5 వరకు ఆగాల్సిందే. లక్ష్మి పార్వతి  జీవితంలో జరిగిన విషయాలు ఈ సినిమా ద్వారా అబద్దలుగా చలామణీ అవుతున్న నిజాల్ని, నిజం ముసుగు వేసుకున్న అబద్దాల్ని అన్నిటిని బట్టబయలు చేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ…..

 

Comments