సైరా తో మరోసారి సై అంటున్న లేడీ సూపర్ స్టార్


 ‘సురేందర్‌ రెడ్డి’ దర్శకతంలో ‘చిరంజీవి’ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాని రాంచరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది.


ఈ సినిమా పూర్తవగానే కొరటాల శివ దర్శకతంలో ఓ సినిమాని చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమా కొరటాల స్టైల్ లో సోషల్ మెసేజ్ కలిగిన కమర్షియల్ సినిమాగా వస్తుంది.
అయితే ఈ సినిమాలో కథానాయకిగా ఎవరని తీసుకోవాలని అనే విషయంపై సందేహంలో ఉన్న కొరటాల. ప్రస్తుతం ‘సైరా’లో చిరంజీవి సరసన అయన సతీమణిగా నటిస్తున్న నయనతారను తీసుకోవాలని అనుకుంటున్నారు.

నయనతారను ఇంకా అడగలేదట దర్శకుడు కొరటాల శివ. మరి అడిగే వరకు వేచ్చి చూడాలి నయనతార ఒపుకుంటుందో లేదో అన్ని … 

Comments