దివంగత ముఖ్యమంత్రి ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కిన్నసినిమా ‘యాత్ర’. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ‘మమ్ముట్టీ’, రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని ‘మహి వి రాఘవ్’ దర్శకతం వహించగా, 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డిలు సంయుత్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
వైఎస్ తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు నటించగా, సబితాఇంద్ర రెడ్డి పాత్రలో మణిరత్నం భార్య సుహాసిని నటిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకొన్ని సినిమాను తెరకెక్కించారు.
అయ్యితే వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈ సినిమాలో నటిస్తున్నాడు అని సమాచారం. వై.ఎస్. జగన్ తెరపై కూడా నిజ జీవిత పాత్రలోనే కనిపిస్తారని సినిమా యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైనా సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన రాగా ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు…….



Comments
Post a Comment