ఎందుకు?… ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, రొండో పాట విడుదల

 ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌‘ సినిమాని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే మొదటి  పాట ‘వెన్నుపోటు’తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇపుడు  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా నుండి రెండవ పాట ‘ఎందుకు? ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్టుగా సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈసారి రామ్‌ గోపాల్‌ వర్మ ఎలాంటి వివాదాలకు తెర తీస్తాడో అని సగటు ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘క్రిష్ జాగర్లమూడి’ దర్శకతంలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు,ఎన్టీఆర్ నాయకుడు’ నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ  సినిమాలో చూపించని ఎన్నో నిజాలను వర్మ తన సినిమా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో నిజనిజాలను చూపిస్తానని చెపుతున్నారు.  జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు…

Comments