Skip to main content

తమిళ స్టార్ ను బీట్ చేసిన సాయి పల్లవి


తమిళ స్టార్‌ ‘ధనుష్‌’ను హీరోయిన్ ‘సాయిపల్లవి‘ బీట్‌ చేసింది. దక్షిణ సినీ పరిశ్రమకు సంబంధించి ధనుష్‌ పడిన ‘కొలవెరి’ పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకుంది. ఈ పాటను ధనుష్ సొంతంగా రాసి పడిన ఈ పాటకు ‘ఏ.ఆర్.రెహమాన్ మేనళ్లుడు అనిరుధ్ రవిచంద్రన్’ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.  2011 నవంబరులో విడుదలైన ఈ సినిమా పాట అంతర్జాతీయంగా గుర్తింపు రావడమే కాకుండా ఏడేళ్లలో 172 మిలియన్‌ వ్యూస్‌ వచ్చి, 1.4 లక్షల మంది పాటను లైక్‌ చేశారు.

అయితే శేఖర్ కమల దర్శకతంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా  2018 సెప్టెంబరులో (యూట్యూబ్‌)లో విడుదలైన, ‘వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే’ ఈ పాటలో సాయిపల్లవి తన చక్కటి స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాట ధనుష్ ‘కొలవెరి’ పాటను బీట్ చేసింది, ఈ పాట ఇప్పుడు 173 మిలియన్ వ్యూస్‌తో అత్యధిక మంది చూసిన దక్షిణాది పాటగా కొత్త రికార్డు సృష్టించి,  4.18 లక్షల మంది  లైక్‌ చేశారు. మన తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం అన్నిటాలీవూడ్ ట్రెండ్ వర్గాల అభిప్రాయం......

Comments