విజయ్ దేవరకొండతో ముగ్గురు హీరోయిన్లు

 కథానాయకుడు ‘విజయ్ దేవరకొండ’ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు, ప్రస్తుతం  ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో రష్మిక మండన తో కలిసి నటిస్తున్న విజయ్. ఈ సినిమా తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ విభిన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్‌తోనే రొమాన్స్ చేస్తూ వచ్చిన విజయ్ ఇప్పుడు ఏకంగా ముగ్గురు  హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు.  ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో  కేథరిన్‌ , ఐశ్వర్య రాజేష్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాని కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.. 

Comments