Skip to main content

దసరాకు రానున్న సైరా నరసింహ రెడ్డి…

 దసరాకు రానున్న సైరా నరసింహ రెడ్డి : బోయపాటి శ్రీను దర్శకతంలో ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ నటిస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సంక్రాంతి కానుకగా విడుదలకానుంది, రామ్ చరణ్ ఒకవైపు నటిస్తూనె మరో వైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నారు. ‘మెగాస్టార్ చిరంజీవి’ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి ‘సురేందర్‌ రెడ్డి’ దర్శకతం వహిస్తున్నారు.

 సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థలో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బ్రిటిష్ ఆంగ్లేయులను ఎదిరించిన మొట్ట మొదటి తెలుగు నాయకుడైన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ “ప్రస్తుతం చివరి దశలో షూటింగ్ జరుగుతుంది, రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ‘సైరా’ తెరకెక్కుతున్నట్టుగా రామ్ చరణ్ తెలిపారు.
కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థను కేవలం నాన్నగారి కోసమే స్థాపించాను, ఆయనతోనే సైరా నరసింహ రెడ్డి  సినిమాలు చేస్తాను. అంతెందుకు.. నా సినిమాల్ని కూడా ఈ బ్యానర్‌లో చేయను. నాన్నే కదా పారితోషికం ఇవ్వకపోయినా ఫర్వాలేదని అన్నారు. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుడులో మా నాన్నగారు ఒకరు. ఏ నిర్మాతా ఇవ్వనంత పారితోషికాన్ని ఆయనకు నేను ఇస్తున్నా, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాము, త్రివిక్రమ్‌తో కూడా ఓ సినిమా ఉంది..
 కొరటాల శివ గారితో పనిచేయాలనుకున్నా, కానీ రాజమౌళితో సినిమా ఉంది కదా, అందుకే ఆలస్యం అవుతోంది. తప్పకుండా కొరటాలతో ఓ సినిమా చేస్తానని రామ్ చరణ్ తెలిపారు. ‘సైరా’ సినిమాకి అమిత్ త్రివేది సంగీత దర్శకుడిగా పనిచేస్తునారు. సైరాలో చిరు సరసన కథానాయకిగా నయనతార నటిస్తుండగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు”. ఈ సినిమాని దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా రామ్ చరణ్ వెల్లడించారు....

Comments