సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పేట’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ అగ్ర దర్శకుడు ‘ఎ.ఆర్. మురుగదాస్’ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాలో రజినికాంత్ సరసన ‘కీర్తి సురేశ్’ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కథానాయకి పాత్రకు ఆమె బాగా సరిపోతారని సినిమా యూనిట్ భావిస్తుంది.
అయ్యితే ఈ సినిమాకి ‘నార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై స్పందించిన మురుగదాస్, రజినికాంత్ తో చేసే సినిమా టైటిల్ ‘నార్కలి’ కాదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అయ్యితే ఈ కొత్త సినిమా గురించి గతంలో మురుగదాస్ మాట్లాడుతూ:- రజినికాంత్ కి కథ చెప్పానని ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఈ సినిమాని ఫాంటసీ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు…



Comments
Post a Comment