మెగా ఫామిలీ నుండి మరో హీరో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు ‘వైష్ణవ్ తేజ్’ వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సోమవారం నాడు రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమానికి ‘మెగాస్టార్ చిరంజీవి’ చీఫ్ గెస్ట్ గా రానున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కొత్త దర్శకుడు బుచ్చి బాబు ఈ సినిమాకి దర్శకతం వహిస్తున్నాడు.కాగా ఈరోజు ఈ సినిమా లాంచ్ చేయగా ముఖ్య అధితులుగా అల్లు అరవింద్, అల్లు అర్జున్,నాగ బాబు, వరుణ్ తేజ్, నిహారిక, సాయి ధరమ్ తేజ్ లు వచ్చారు. మెగా స్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమాని లాంచ్ చేసారు….


Comments
Post a Comment