వినయ విధేయ రామ రివ్యూ

నటినటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ ప్రధాన పాత్రలు.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
నిర్మాత: డీ.వీ.వీ. దానయ్య
దర్శకత్వం: బోయపాటి శ్రీను
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
బోయపాటి శ్రీను దర్శకతంలో రామ్ చరణ్ నటించిన సినిమా ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ అని మాస్ యాక్షన్ సినిమాలే తీశారు. ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ‘వినయ విధేయ రామ’ ఎలా ఉందొ చూద్దాం…
కథ:- ఓ అందమైన ఫ్యామిలీలో ఐదుగురు అన్నదమ్ములు (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌), అందరి కన్న చిన్నవాడు రామ్ కొణిదెల (రామ్‌చరణ్) ఉంటారు. రామ్ అంటే ఇంట్లో వాళ్లకి చాల ఇష్టం, అలాగే కుటుంబం అంటే కూడా రామ్ కు ఇష్టం. రామ్ పెద్ద‌న్న(ప్ర‌శాంత్‌) విశాఖపట్నం ఎలక్షన్ కమీషనర్‌ ఆఫీసర్ గా ప‌నిచేస్తుంటాడు.విశాఖపట్నంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం(ముఖేష్ రుషి) చేసే అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న బ‌య‌ట పెడ‌తాడు, దీంతో ప్రశాంత్ – పరశురాంల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. అది నచ్చని పరశురాం, రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి అందరిని చంపాలాన్నిఅనుకుంటాడు. అందుకోసం బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌(వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి సమస్యలు వచ్చాయి..? అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాలో చూడాలి….
ప్లస్ పాయింట్స్:- ఈ సినిమా ఒక‌పైపు పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా మరోవైపు త‌న అన్న‌కు, కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాటం సినిమాలో మంచిగా చూపించారు. ఒక కుటుంబంలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, రిచ్‌గా దర్శకుడు చూపించాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా నచుతుంది.

హీరోయిన్ కియారా అడ్వాణీ తన నటనతో అలరించింది. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌లు తమ పాత్ర‌ల‌కు సరైన న్యాయం చేశారు. విలన్ గా పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో బాగా న‌టించాడు. రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాకి ప్రధాన బలం, యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌కు చాలా బాగా న‌చ్చుతాయి. హీరోకి – విలన్ మధ్యలో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ అని చెప్పవచు. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోప్ చాలా బాగా ఇచ్చరు.

మైనస్ పాయింట్స్:-దర్శకుడు బోయపాటి శ్రీను తీసినా అని సినిమాల కన్నా మితిమీరిన హింస‌ను ఈ సినిమాలో చూపించారు. బోయ‌పాటి హీరోయిజని ఎలివేట్ చేసి చూపించాడు, రామ్‌చ‌ర‌ణ్‌లో ఫైట‌ర్‌ను చూడాలంటే ఈ సినిమా చుడసిందే అనేలా సినిమా ఉంది. రామ్ చరణ్ స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌నిపిస్తుంది.

              “సంక్రాంతికి ఈ సినిమా ఫామిలీ ప్రేక్షకులకు – మాస్ ప్రేక్షకులకు చాలా బాగా నచుతుంది”

Comments